16 April, 2026 | 2:10 AM

ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమానికి సంపూర్ణ సహకారం

16-04-2026 12:00 AM

విహారయాత్రకు 15 లక్షలు అందచేత

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

రామచంద్రాపురం (పటాన్‌చెరు), ఏప్రిల్ 15: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రామచంద్రపురం ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కాశీ, అయోధ్య, ఢిల్లీ విహారయాత్రను బుధవారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విహారయాత్ర కోసం 15 లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు.

గత దశాబ్ద కాలంగా పెన్షనర్ల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు వారికి సొంత భవనం సైతం నిర్మించి ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారి కష్టసుఖాల్లో అండగా ఉంటున్నామని తెలిపారు. తమ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ కు  పెన్షనర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి,  పరమేష్ యాదవ్, ఐలేష్, ప్రమోద్ గౌడ్, పెన్షనర్ల సంఘం ప్రతినిధులు రామిరెడ్డి, రాములు, నాగభూషణం పాల్గొన్నారు.