calender_icon.png 22 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యానం వైపు మొగ్గు

22-09-2025 01:06:11 AM

-పంటల సాగు పెంచేందుకు సర్కార్ కార్యాచరణ 

-లక్ష ఎకరాల్లో ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో హార్టికల్చర్ శాఖ 

-తక్కువ విస్తీర్ణంలో ఉద్యాన పంటలకు అవకాశం 

-రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ సమాయత్తం 

-ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు వివరించాలని నిర్ణయం 

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణలో ఉద్యాన పంటల సాగు పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాలకు పైగా ఉద్యాన పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. వచ్చే ఐదారేళ్లలో ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా.. సొంత రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని హర్టికల్చర్ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో మామిడి పండ్లు తప్పా ఇతర పండ్లు, కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ఉద్యాన శాఖ రాష్ట్రంలోనే వివిధ రకాలు పండ్లు, కూరగాయల ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు భారీగా రాయితీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆయిల్‌పామ్ తోటలపెంపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది.

వీటితో పాటు పండ్లు, కూరగాయల సాగు కూడా భారీగా పెంచేలా ఊరూరా అన్నదాతలకు అవగాహన పెంచేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. బోరు, బావుల కింద ఈ పంటలు వేస్తే నీటి ఆదాతో పాటు ఆదాయం కూడా అధికంగా వస్తోంది. సన్న, చిన్న రైతులకు ఉద్యాన సాగు ఎంతో ఉపయోగపడుతుందని, శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించనుంది. 

మామిడి మినహా మిగతా బయటి నుంచి.. 

ఇదిలా ఉండగా, చాలా రకాలు కూరగాయలు, పండ్లు పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. దీంతో ధరలు అధికంగా ఉండటంతో పేద, మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు చేయలేకపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు పండ్లు, కూరగాయ ల ధరలు అందుబాటులో ఉండాలంటే రాష్ట్రంలో ఉత్పత్తి చేయాలని అంచనాతో ఉన్నారు. అందుకు రైతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తే ఉద్యాన పంటలు వేసేందుకు రైతులు ముందుకు వస్తారని భావిస్తున్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను రైతులకు వివరించేందుకు హర్టికల్చర్ అధికారులు సిద్ధమయ్యారు.

మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పండ్లను ఉత్తత్తి చేయడం ద్వారా రైతులకు ఆశించిన రీతిలో లాభాలు వచ్చే విధంగా పండ్ల తోటలను ఎం పి క చేస్తోంది. అయితే రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణంలో మామిడి, బత్తాయితో పాటు మిగతా కొన్ని పం టలు ఉన్నప్పటికి.. రాష్ట్రానికి సరిపడా కావాలంటే మి గతా ఫలాలపై ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుం ది. దీన్ని అధిగమించేందుకు భారీగా ఉద్యాన పంటలు సాగు చేయాలని హర్టికల్చర్ శాఖ దృష్టి సారించింది. 

మూడు నుంచి ఐదు ఎకరాల వరకు సబ్సిడీ పెంపు.. 

గతంలో ఉద్యాన పంటలకు మూడు ఎకరాల వర కే సబ్సిడీ ఉండేది. ఇప్పుడు ఐదు ఎకరాల వరకు సబ్సిడీ సాయం అధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక సాయాన్ని కూడా నేరుగా రైతుల బ్యాం కు ఖాతాలో జమ చేస్తారు.  పంటల సాగు ఖర్చు ప్రాతిపదికన గతంలో ఉన్న యూనిట్ ధరలను రెట్టిం పు చేయడంతో పాటు సబ్సిడీని 40 శాతానికి పెంచారు. రాయితీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం, 40 శాతం చొప్పున తమ వాటాలను భరించనున్నాయి.

దీంతో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతు లను పండ్ల తోటల సాగువైపు మళ్లించొచ్చని సర్కార్ ప్రయత్నం చేస్తోంది. అంతే కాకుండా రైతులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఏడాదంతా ఏదో రకమైన పంటలు వేసుకొని ఆర్థికంగా బలపడేందుకు అవకాశం ఉంటుందని హర్టికల్చర్ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. చాలా మంది రైతులు తక్కువ భూమి ఉండటంతో ఇతరులకు కౌలుకు ఇచ్చి పట్టణాల బాట పట్టారు. పండ్లు, కూరగాయలు సాగు చేస్తే కుటుంబానికి ఉపాధితో పాటు మరో ఐదారుగురికి జీవనోపాధి చూపిస్తారని అధికారులు చెబుతున్నారు.  

ఈ ఆర్థిక సంవత్సరానికి అందించే ప్రోత్సహకాలు..

కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యాన పంటలకు అందిస్తున్న రాయితీలు, నిధులను హర్టికల్చర్ శాఖ ప్రకటించింది. జామ, బొప్పాయి, మామిడి, బత్తాయి, అరటి, డ్రాగన్, అవకాడో తదితర పండ్ల తోటలకు ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ.32 వేలు, పుట్టగొడుగుల పెంపకానికి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయనుంది. కూరగాయల సాగుకు ఎకరాకు రూ.9,600, ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పసుపు, పూలు, జీలకర్ర, ఓమ, సుగంధద్రవ్యాలకు ఎకరానికి రూ.8 వేలు ఇవ్వనున్నారు.

జర్నేర, బ్యూబెరో, గ్లాడియోలస్, లిల్లీ వంటి పూల సాగుకు ఎకరాకు రూ.40 వేలు, పాత తోటల అభివృద్ధికి రూ.9,600 అందిస్తారు. ఇక సేంద్రియ సాగు, నర్సరీల ఏర్పాటు, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, పాలీహౌస్‌లు, కోల్డ్ స్టోరేజీలు, సౌర పంట ఎండపెట్టే యంత్రాల వంటి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం 30 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాకుండా పాత తోటల పునరుద్ధరణకు రూ.2 కోట్లు, ప్లాస్టిక్ మల్చింగ్ కోసం రూ.14.24 కోట్లు, నీటి వనరుల కోసం రూ.2.73 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.