14-09-2025 12:15:11 AM
మణికొండ,సెప్టెంబర్ 13(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని 15 రోజుల పాటు ’సేవా పక్ష’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ మణికొండ మున్సిపాలిటీ శాఖ తీర్మానించింది. కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపుమేరకు శనివారం స్థానిక బీజే పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యశాలలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అయి న అక్టోబర్ 2 వరకు ప్రజాసేవకే అంకితం కావాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి మాట్లాడుతూ, ప్రధాని మోడీ నిస్వార్థ సేవకు గుర్తుగా ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని కోరారు. ఉత్స వాల కార్యాచరణను వివరిస్తూ..
17వ తేదీన రక్తదాన శిబిరాలు, 18న చిత్రలేఖన పోటీలు, 25న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అలాగే, 27న దివ్యాంగులను, 28న సమాజంలో విశిష్ట సేవలు అందించిన వారిని సన్మానించాలని సూచించారు. అక్టోబర్ 2న గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేసి ధరించాలని పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను కన్వీనర్గా సి. బీరప్ప, కో-కన్వీనర్గా కందుల శ్రీనివాస్ రెడ్డికి అప్పగించినట్లు ప్రకటించారు.
ఈ కార్యశాలలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజన్ కుమార్ గౌడ్, మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొండకల్ల నరేందర్ రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షులు బి. రవికాంత్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జె. సిద్ధప్ప, జై లక్ష్మీ, ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ జి. వినోద్, నాయకులు సిహెచ్. ఇందిర, సంగీత, స్రవంతి, సరస్వతి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు, కోశాధికారి యాలాల యాదయ్య, దిలీప్ కక్కడ్ పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.