06-08-2025 01:37:33 AM
కాప్రా, ఆగస్టు 5 : కుషాయిగూడ కూరగాయల మార్కెట్ పైకప్పు పునర్నిర్మాణానికి 55 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. పైకప్పు అస్తవ్యస్తంగా ఉండటంతో మార్కెట్ కమిటీ సభ్యులు చేసిన విజ్ఞప్తిపై, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ సమన్వయంతో నిధులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా ప్రొసీడింగ్స్ను ఇద్దరూ కలిసి మార్కెట్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.