06-08-2025 01:36:28 AM
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కూలిందో కేసీఆర్, హరీశ్‌రావు సమాధానం చెప్పడం లేద ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జ స్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన మాజీ మంత్రి హరీశ్ రావు తెగ భుజాలు తడుము కుంటున్నాడని విమర్శించారు.
హరీశ్‌రావు ముందుగా తెలుసుకోవాల్సింది అది జ్యుడీషియల్ కమిషన్ రిపోర్ట్ అని, సీఎం రేవం త్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపోర్ట్ కాదని హితవు పలికారు. పీసీ ఘోష్ పైన విమర్శలు చేయడం అంటే ఆకాశం పైన ఉమ్మి వేయడమేనని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో హితవు పలికారు. ఘోష్ కమిషన్ ఏకపక్షంగా నివేదిక ఇవ్వలేదని, కేసీఆర్, హరీశ్‌తో పాటు అనేకమంది వాదనల ను తీసుకున్నారని, ఈ విషయాన్ని మరిచిపోయి విమ ర్శలు చేయడం సరికాదన్నారు. ‘హరీశ్‌కు బీఆర్‌ఎస్ పార్టీకి వ్య వస్థలపైన నమ్మకం లేదు. జ్యుడీషియల్ కమిషన్ అంటే గౌరవం లేదు.
ఎన్డీఎస్‌ఏ అంటే పట్టింపు లేదు. సీడబ్ల్యూసీ అంటే లెక్క లే దు. అన్ని పార్టీల అభి ప్రాయం కోసం ప్రభుత్వమే అసెంబ్లీలోనివేదికను చర్చకు పెడు తుంది. కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకువచ్చి ఆయనతోనే మాట్లాడించవచ్చు. ఆయన ప్ర శ్నలన్నింటికీ ప్రభుత్వం అసెంబ్లీలో సమాధా నం చెపుతుంది.
నివేదికతో కేసీఆర్, హరీశ్ పాపం, ఈటెల నిర్లక్ష్యం బయటపడ్డాయి. కూలిన కాళేశ్వరానికి కేసీఆర్, హరీశ్‌రావే బా ధ్యులు. తెలంగాణ సమాజం అన్నింటిని చూ స్తోంది. ప్రజలే న్యాయనిర్ణేతలు’ అనే విష యం తెలుసుకోవాలని హితవు పలికారు.
బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలి
రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కేం ద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను సాధించుకుంటామని ఆయనఅన్నారు. బిల్లును 9వ షె డ్యూల్లో చేర్చే వరకు తమ పోరాటం ఆగద న్నారు. బీసీ పోరుకు బీసీ సంఘాలు, ఎన్జీవో సంఘాలు కూడా మద్దతు తెలిపాయన్నారు.