08-11-2025 12:00:00 AM
వలిగొండ, నవంబర్ 7 (విజయక్రాంతి) : వలిగొండ మండలంలోని సంగెం గ్రామం పరిధిలో గల భీమలింగంను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం వెంటనే తగిన నిధులు కేటాయించాలని, ప్రస్తుత భీమ లింగం బ్రిడ్జి పై హై లెవెల్ బ్రిడ్జి వెంటనే నిర్మాణం చేపట్టి శివలింగం వరకు వెళ్లేందుకు నూతన బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.
శుక్రవారం సిపిఎం నాయకులు శివలింగం వరకు వెళ్లేందుకు గ్రామస్తులు చందాలు వేసుకొని ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పునర్జీవన కార్యక్రమం పేరుతో సంగెం గ్రామానికి వచ్చి సంవత్సరం గడుస్తున్నదని నేటి వరకు భీమలింగం వద్ద ఎలాంటి పనులు చేపట్ట లేకపోయారని అన్నారు.
భీమ లింగానికి హై లెవెల్ బ్రిడ్జిని మంజూరు చేశామని ప్రకటన తప్ప ఎలాంటి కార్యచరణ ప్రకటించలేకపోయారని అన్నారు. నిత్యం అనేకమంది ప్రజలు భీమలింగం మరియు శివలింగాలను చూడడానికి రాకపోకలు కొనసాగిస్తున్నారని ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి భీమ లింగంను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈర్లపల్లి ముత్యాలు, భీమనబోయిన జంగయ్య, దొడ్డి బిక్షపతి, వేముల నాగరాజు పాల్గొన్నారు.