calender_icon.png 12 October, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తులో బీసీ సీఎం

11-10-2025 02:01:10 AM

మాజీ మంత్రి గంగుల కమలాకర్ 

కరీంనగర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ బీసీలకు అగ్రస్థానం కల్పిస్తుందని, భవిష్యత్తులో తెలంగాణకు బీసీ సీఎం అయ్యే అవకాశం ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ బాకీ కార్డులతో కరీంనగర్ గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డును అందజేశారు. 

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా బీఆర్‌ఎస్ పోరాడుతుందన్నారు. రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్  బీసీలకు అగ్రస్థానం కల్పిస్తుందని, బీసీ సీఎం అయ్యే అవ కాశాలు కూడా ఉన్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత క ల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.