14-09-2025 12:51:17 AM
35 మంది టెర్రరిస్టుల హతం
12 మంది పాక్ సైనికులు సైతం మృతి
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 13: గత రెండు రోజులుగా సరిహద్దుల్లో ఉన్న తాలిబన్లను తుదముట్టించేందుకు పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల వద్ద రెండు దాడులు నిర్వహిం చింది. ఈ దాడుల్లో 35 మంది టెర్రరిస్టులు హతం కాగా.. 12 మంది పాకిస్థాన్ సైనికులు కూడా మృతి చెందినట్టు సైన్యం శనివారం ప్రకటించింది.
వాయువ్య ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్‌లో నిర్వహించిన మొద టి దాడిలో 22 మంది టెర్రరిస్టులు హతం కాగా.. దక్షిణ వరిజిస్తాన్‌లో జరిపిన మరో దాడిలో మిగగా 13 మంది ఉగ్రవాదులు మరణించినట్టు సైన్యం పేర్కొంది. దక్షిణ వరిజిస్తాన్‌లో ఉగ్రమూకలతో పోరాడుతుం డగా.. 12 మంది సైనికులు అమరులయ్యారని తెలిపింది.
చాలా మంది ఉగ్రవాదులు అఫ్ఘనిస్తాన్ గడ్డమీద ఉంటూ పాకిస్థాన్‌లో దాడులకు తెగబడుతున్నారని సైన్యం తెలిపింది. ‘అఫ్ఘన్‌లో ఉంటూ పాక్‌కు వ్యతిరే కంగా కుట్రలు చేయకుండా టెర్రరిస్టులను అంతం చేయాలి’ అని పాక్ సైన్యం కాబూల్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.