17-08-2025 12:24:48 AM
కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 16 (విజయక్రాంతి): మాజీ ప్రధాని అటల్ బిహా రీ వాజ్‌పేయి ఆశయ సాధనే మనందరి కర్తవ్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వాజ్‌పేయి వర్దంతి సందర్భంగా బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాజ్‌పేయి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో వాజ్‌పేయి చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
‘అటల్ జీ కేవలం ఒక ప్రధాని మాత్రమే కాదు, కోట్లాది మంది కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాత. ఆయన తన రాజకీయ జీవితంలో విలువలకు పెద్దపీట వేశారు. అజాతశత్రువుగా రా జకీయ ప్రత్యర్థుల మన్ననలు సైతం అందుకున్న గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన హ యాంలోనే పోఖ్రాన్ అణుపరీక్షలతో భారతదేశం తన సత్తాను ప్రపంచానికి చాటింది.
స్వర్ణ చతుర్భుజి వంటి మౌలిక సదుపాయా ల ప్రాజెక్టులతో అభివృద్ధికి కొత్త బాటలు వేశారు’ అని అన్నారు. ఆయన చూపిన మా ర్గంలో పయనిస్తూ, ఆయన ఆశయాలను సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు.