calender_icon.png 17 August, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పూజలు

17-08-2025 12:25:29 AM

ముషీరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి) : శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరిం చుకొని భోలక్ పూర్ డివిజన్ పద్మశాలి కాలనీలోని ప్రసిద్ధిగాంచిన ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం  బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బింగి నవీన్, భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక  పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్‌ఎస్ యవ నాయకుడు ముఠా జైసింహ పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకకళ్యాణం కోసం భువిపై అవత రించిన శ్రీ కృష్ణపరమాత్ముని అండదండలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉం డాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన అలవర్చుకున్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ భోలక్ పూ ర్ డివిజన్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, పార్టీ సీనియ ర్ నాయకుడు దీన్ దయాల్ రెడ్డి, కృష్ణమూర్తి, బీఆర్‌ఎస్ యువజన కమిటీ అధ్య క్షుడు సాయికుమార్, కార్యదర్శులు కృష్ణ, సుధాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

కవాడిగూడలో కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా  శనివారం కవాడిగుడకు చెందిన  ప్రముఖ పారిశ్రామిక వేత్త పోటెల్ గోపాల్ యాదవ్ నివాసంలో  కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, ఆయన సతీమణి అనురాధ కుటుంబ సభ్యులు అఖిల్ యాదవ్, వ్రిందా యాదవ్, హారిక యాదవ్ తదితరులు  పాల్గొన్నారు.