17-08-2025 12:24:07 AM
-బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డీ.శివ ముదిరాజ్
ముషీరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి) : ఎమ్మెల్యే ముఠా గోపాల్ సారధ్యంలో ముషీరాబాద్ సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డి. శివ ముదిరాజ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ చౌరస్తాలో రేయిన్ కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శివ ముదిరాజ్ మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ నిరంతరం కృషిచేస్తున్నారన్నారు. వారిని స్పూర్తిగా తీసుకొని పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు టి. సోమన్, డివిజన్ నాయకులు బిక్షపతి యాదవ్, శ్రీనివాస్, జావిద్ ఖాన్, సదా, వెంకటేశ్వర్ రావు, మోహిన్, మురళీధర్ లు పాల్గొన్నారు.