06-12-2025 12:00:00 AM
నిధుల మంజూరుకు మంత్రి హామీ
భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (విజయక్రాంతి) :హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామ సర్పంచ్ గా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవం కావడంతో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను శుక్రవారం హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెం దిన సీనియర్ నాయకులు కేతిరి లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకోవడం పట్ల లక్ష్మారెడ్డి తో పాటు గ్రామస్తులను మంత్రి అభినందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బ లపరిచిన అభ్యర్థి లక్ష్మారెడ్డిని సర్పంచ్ గా ఏకగ్రీవడం చేయడం శుభపరిణామమని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలి సికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీ సుకురావాలని మంత్రి లక్ష్మారెడ్డికి సూచించారు.
తనపై నమ్మకంతో గ్రామ ప్రజలు తన ను సర్పంచ్ గా ఏకగ్రీవం చేశారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామంలో అభివృద్ధి పనులు చేసేందుకు తనకు ప్రత్యేక నిధులు కావాలని ఏకగ్రీవ సర్పంచి కేతిరి లక్ష్మారెడ్డి మంత్రిని కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కేతిరి లక్ష్మారెడ్డి గ్రామస్తుల తరఫున మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.