calender_icon.png 25 December, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధీరే ధీరే తూ.. దిల్లో ఆగయీ..

25-12-2025 01:28:17 AM

విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు కేవీ అనుదీప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫంకీ’. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. -కయాదు లోహార్ కథానాయికగా నటిస్తోంది. నరేశ్, వీటీవీ గణేశ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా తొలిగీతం ‘ధీరే ధీరే’ను విడుదల చేశారు. ‘ఉన్నమాట పైకి చెప్పనంటూ.. లోపలేమో నిన్ను ఒప్పుకుంటూ..

నువ్వలా ప్రేమించవే.. ముద్దుముద్దుగా తిట్టుకుంటూ.. ముందరున్న నన్ను తప్పుకుంటూ.. సరేలే ఊరించవే.. గుప్పెడంత గుండెకెంత గుట్టు.. ఎందుకంట దానికంత బెట్టు.. నీకు నువ్వే చేయి చేయి పట్టేదాక.. నే వేచి ఉంటానులే.. ధీరే ధీరే తూ.. ధీరే ధీరే తూ.. దిల్లో ఆగయీ.. పిల్ల దిల్లే లేగయీ..’ అంటూ సాగుతోందీ పాట. భీమ్స్ సిసిరోలియో స్వరపర్చిన ఈ పాటను సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించగా, చిత్ర దర్శకుడు కేవీ అనుదీప్ సాహిత్యం అందించడం విశేషం. ఈ చిత్రానికి డీవోపీ: సురేశ్ సారంగం; ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: జానీ షేక్.