calender_icon.png 25 December, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడాలపల్లిలో ఉమెన్స్‌కు ఉచిత టైలరింగ్ శిక్షణ

25-12-2025 12:25:38 AM

తూప్రాన్, డిసెంబర్ 24 : తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పడాలపల్లి గ్రామంలో జల జీవన ఉమెన్ ఎన్ పవర్మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ, సబ్సిడీపై మిషిన్ పంపిణీ చేస్తూ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇందులో భాగంలో తూప్రాన్, పడాలపల్లికి సంబంధించి 40 మంది విద్యార్థులు శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా 40 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ అరుణ వెంకట్ గౌడ్, జల జీవన సంస్థ సీఈవో రవి కుమార్, డిస్టిక్ కో ఆర్డినేటర్ శిల్ప, ట్రైనర్స్ రవళి, శ్రీలత, 40 మంది స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది.