25-12-2025 01:29:36 AM
టాలీవుడ్ సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ తెలుగు, తమి ళం, కన్నడ, హిందీ, మల యాళం భాషల్లో వంద లాది సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం రాధిక నటిస్తున్న కొత్త సినిమా ‘థాయ్ కిజావి’ టీజర్ బుధవారం విడుదలైంది. ఇందులో ఆమె వృద్ధురాలిగా కనిపించి ఆశ్చర్యపరి చింది. మాస్ లుక్ పాత్రను తొలిసారి పోషి స్తున్న రాధిక గెటప్‌ను చూసినవారు బజావో తాలియా అనకుండా ఉండలేకపోతున్నారు.
దర్శకుడు శివకుమార్ మురుగేశన్ తమిళంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇంకా సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. వచ్చే ఫిబ్రవరి 20న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తారా.. లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.