25-12-2025 12:00:00 AM
ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యంలో అవగాహన
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ఇండియన్ బ్యాంక్, విజయవాడ జోన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్లో మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఒక ఎస్ హెచి అవుట్ రీచ్ క్యాంపెయి న్‌ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వి. చంద్రశేఖరన్, జనరల్ మేనేజ ర్, ఆర్ బిడి, ప్రణేష్ కుమార్, ఫీల్డ్ జనరల్ మేనేజర్, హైదరాబాద్, ఎం. రాజేష్, జోనల్ మేనేజర్, విజయవాడ, ఎన్. గౌరీ శంకర్‌రావు, జోనల్ మేనేజర్, అమరావతి, రాష్ట్ర అధికారులు ఎ.ఎన్.వి. సంచర రావు, ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఆర్డీఏ, ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇతర అధికా రులు హాజరయ్యారు.
విజయవాడ జోనల్ మేనేజర్ ఎం. రాజేష్ మాట్లాడుతూ.. విజయవాడ జోన్‌లో స్వయం సహాయక బృందా లకు ఆర్థిక సహాయం అందిం చడంలో ప్రత్యేకత కలిగిన 4 మైక్రోశాట్ బ్రాంచ్లు ఉన్నా యని తెలిపారు. ఇండియన్ బ్యాంక్ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు 5000 స్వయం సహాయక బృందాలకు ఆర్ధిక సహాయం అందిస్తోందని, 43 బ్రాంచ్లు స్వయం సహాయక బృందాల ఆర్థిక అవసరాలను తీర్చడా నికి నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
వి. చంద్రశేఖరన్, జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. ఈ ఎస్ హెచ్‌ఐజి అవు ట్‌రీచ్ క్యాం పెయిన్లో ఇండియన్ బ్యాంక్ ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి రూ. 1150 కోట్ల స్వయం సహాయక బృందా ల రుణాలను మంజూరు చేసిందని తెలిపారు. మహిళా సాధికారత, వారి స్వయం సమృద్ధి కోసం ఇండియన్ బ్యాంక్ ఎల్లప్పుడూ సిద్ధం గా ఉంటుందని పేర్కొన్నారు. ఇండియన్ బ్యాంక్‌లో స్వయం సహాయక బృందాల కోసం ఉత్పత్తులను రూపొందిస్తున్నామని, తద్వారా వారు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందవచ్చని, ఇతర ఛార్జీల నుండి కూడా మినహాయింపు పొందవచ్చని తెలిపారు.