25-12-2025 12:03:13 AM
హైదరాబాద్, డిసెంబర్ 24(విజయక్రాంతి) : వికసిత్ భారత్ జీ రామ్‌జీ బిల్లుతో గ్రామాల్లో నూతన శకం మొదలైందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఉపాధి హామీ పథకంలో గొప్ప సంస్కరణలు కేంద్రం తెచ్చిందన్నారు. గ్రామీణ పేదలకు మేలు చేసేలా రూపల్పన చేసిందన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉన్నప్పుడూ నాట్లు, కోతల సమయంలో 60 రోజులు హాలీడే ఇవ్వడం.. రైతులకు కూలీల కొరత లేకుండా తీసుకున్న నిర్ణయమని స్పష్టంచేశారు.
గతంలో వంద రోజులు పని కల్పిస్తే.. ప్రస్తుతం 12 రోజులకు పని రోజులు పెంచిందన్నారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ఏమైనా గాంధీ కుటుంబమా అని ప్రశ్నించారు. గాంధీని దేశం మొత్తం ఆరాధిస్తుందని, ఆయన్ని అందరూ గౌరవిస్తారని వారి సొంతం కాదని చెప్పారు.
బీహార్ ఎన్నికల్లో ఎస్‌ఐఆర్ అంశంతో కేంద్రం పైన బురదజల్లే ప్రయత్నం చేశార న్నారు. కేసీఆర్ మరోసారి పాలమూరు ప్రా జెక్ట్ గురించి మాట్లాడుతున్నారని, పాలమూ రు జిల్లాకు న్యాయ చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతున్నరని ఆరోపించారు.