calender_icon.png 7 September, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా వాతావరణంలో జరుపుకోవాలి

04-09-2025 09:14:16 PM

ఎస్ఐ బోయిని సౌజన్య..

బెజ్జంకి: గ్రామాల్లో గణేష్ నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని మండల పరిధిలోని ప్రజలకు ఎస్ఐ బోయిని సౌజన్య(SI Boini Soujanya) గురువారం తెలిపారు. మండల పరిధిలోని గ్రామాల్లో ఎవరైనా నిమజ్జన ఊరేగింపు సమయంలో మండపం వద్ద డీజే పెడితే సీజ్ చేసి చట్టపరమైన చర్య తీసుకుంటమని తెలిపారు. డీజేలు వాడకుండా సంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చెయ్యాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏడవ తేదీ వరకు మండల పరిధిలో మద్యం అమ్మకాలు నిషేధించడమేమైనా తెలిపారు. మద్యం అమ్మకాలు జరిపినట్లైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.