17-08-2025 11:26:03 PM
జహీరాబాద్: జహీరాబాద్ న్యాల్కల్ మండలాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాల వివరాలను అందించాలని జహీరాబాద్ టౌన్ ఎస్సై వినయ్ కుమార్, అద్నూర్ ఎస్సై సుజిత్ కుమార్ ను తెలిపారు. గణేష్ మండపాలను ఏర్పాటు చేసే వివరాలన్నింటినీ పోలీస్ ప్రోటాల్ లో నమోదు చేసి వాటి జిరాక్స్ కాపీని పోలీస్ స్టేషన్లో అందించాలని వారు తెలిపారు. దీని ద్వారా ఎక్కడెక్కడ గణేష్ మండపాలు నిర్వహిస్తున్నారు. వాటి వివరాలు అన్నింటిని పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి రక్షణ కల్పిస్తారని వారు తెలిపారు. ఆయా నేశ మండపాలు చిన్నయ, పెద్దదా అని తేడా లేకుండా గణేష్ ఉత్సవ కమిటీలు ఈ విషయాన్ని గమనించి పోలీసు సహకరించాలని దీని ద్వారా పోలీసులు తమ గణేష మండపాలకు రక్షణ కల్పిస్తారని వారు తెలిపారు.