17-08-2025 11:49:21 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితులను స్థానిక పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన కుంటల బీమయ్య, అంతర్గం మండలానికి చెందిన మడక చిరంజీవి, మంచిర్యాలకు చెందిన కడమంచి శ్రీనివాస్ లు ఈనెల 16న అర్ధరాత్రి గాంధారి మైసమ్మ ఆలయానికి వేసిన తాళం పగులగొట్టి హుండీలో ఉన్న రూ.4వేల నగదుతో పరారయ్యారు.
ఆదివారం క్యాతనపల్లి ఏరియాలో నలుగురు అనుమానస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకోనే ప్రయత్నంలో ఒకరు పారిపోయారు.మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా మైసమ్మ ఆలయంలో వారు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసును ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ జంగు,రాము, రాజేశ్వర్ రావు,మహమ్మద్,వెంకటేశ్వర్లు, సురేష్,సంజీవ్ లను అధికారులు అభినందించారు.