18-08-2025 12:10:37 AM
అధ్యక్షుడు పాలకుర్తి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా తాటి రాజశేఖర్ గౌడ్
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవులా గ్రామంలో ఉన్న తాటి వనంలో ఆదివారం గీత కార్మికుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాఅథిగా గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండేపోయిన రవి గౌడ్, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంలో కన్నాయిగూడెం కల్లు గీత కార్మిక సంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
మండల గౌరవ అధ్యక్షులుగా మారగాని రాజు గౌడ్, మండల అధ్యక్షులుగా పాలకూర్తి శ్రీధర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా తాటి లచ్చలు,ప్రధాన కార్యదర్శిగా తాటి రాజశేఖర్ గౌడ్, కార్యదర్శిగా తాటి యాదగిరి గౌడ్,కోశాధికారిగా బత్తిని ఎల్లాస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండేపోయిన రవి గౌడ్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సోసైటీకీ తాటి చెట్లు పెంపకం కోసం 10ఎకరాల భూమిని కొని ఇవ్వాలని ఏజెన్సీ పేరుతో రద్దు చేసిన సోసైటీలను ముఖ్యమంత్రి వెంటనే పునరుద్దరణ చేసి మాట నిలుపుకోవాలని అన్నారు.