18-08-2025 12:53:27 AM
పరిగి, ఆగస్టు 17( విజయక్రాంతి) ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదివారం సందర్శించారు. పరిగి పట్టణంలో కుక్క కాటుకు గురైన వారిని పరామర్శించి వైద్యానికి సంబంధించి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జిల్లా ఆరోగ్య అధికారులతో మాట్లాడి తక్షణమే అవసరమైన మందులు, చికిత్స అందుబాటులో తేవాలని తెలిపారు.లోతుగా కుక్క కాటుకు గురైన వారికి కావలసిన ఇంజెక్షన్లు వికారాబాద్ ఆసుపత్రిలో అందుబాటులో ఉండడంతో తక్షణమే తెప్పించి వైద్యం అందించాలని తెలిపారు..
కుక్క కాటుకు గురైన వ్యక్తులకు ఇచ్చే రేబీస్ వైరస్ కు సంబంధించిన ఇంజెక్షన్ గురించి జిల్లా డి సి హెచ్ ఎస్‌అధికారి ఆనంద్ తో ఫోన్లో మాట్లాడి రేబీస్ ఇమినో గ్లోబులిన్స్ ఇంజెక్షన్ పరిగి ప్రభుత్వ ఆసుపత్రి లో అందుబాటులో ఉంచి అవసరమైన వారికి ఇంజెక్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు.ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిసిహెచ్‌ఎస్ ఆనంద్ హైదరాబాద్ నుండి ఇంజెక్షన్ ను తెప్పించి రేపటి లోగా పరిగి ఆసుపత్రిలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
కుక్క కాటుకు సంబంధించిన అన్ని రకాల వైద్య సదుపాయాలు పరిగి ఆసుపత్రి లో అందుబాటులో ఉండేట్టు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి కుక్క ల బెడద తగ్గేటట్టు వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్ వెంకటయ్య నుఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆయుబ్, కాంగ్రెస్ నాయకులు ఎజాజ్, చిన్న నర్సింలు, గన్నేమోని శ్రీనివాస్, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, మహిపాల్, తదితరులుపాల్గొన్నారు.