18-08-2025 12:51:20 AM
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్, ఆగస్టు 17 : ప్రజలందరూ మ ట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు. నాగోల్ లో 63 అడుగుల మట్టి గణనాథ విగ్రహాన్ని ఆదివారం సందర్శించారు.
వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని తిరంగా యూత్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో నాగోల్ సమతాపురి కాలనీలో ఏర్పాటు చేస్తున్న 63 అ డుగుల మట్టి గణనాథుడి విగ్రహాన్ని సందర్శించి, 19 ఏళ్లుగా వినాయక విగ్రహాన్ని ఏ ర్పాటు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు.
పర్యావరణ సహితమైన మట్టి గణ నాధుని ఏర్పాటు చేయడం అందరికీ ఆదర్శమని సూచించారు. కార్యక్రమంలో హైదరా బాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, నాయకులు కొండోజు శ్రీనివాస్, దా ము మహేందర్ యాదవ్, రమేష్, నాగార్జు న రెడ్డి , తిరంగా యూత్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులుపాల్గొన్నారు.