calender_icon.png 18 August, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశాయిపేటలో నీటి ఎద్దడి

18-08-2025 12:00:00 AM

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

డిస్ట్రిబ్యూటర్ కాలువల ద్వారా కాలనీలోకి నీరు

బాన్సువాడ, ఆగస్టు 17 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలోని బీడీ వర్కర్స్ కాలనీలో గత రెండు రోజులుగా నీటి ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీలో సింగిల్ ఫేస్ మోటర్ గత ఐదు సంవత్సరాలుగా ఉపయోగంలో లేకపోవడంతో కాలనీలోకి రావాల్సిన త్రాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలకు తాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారు

ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దేశాయిపేట్ గ్రామంలోని పెగడ చెరువు నిండి ఉండడంతో డిస్ట్రిబ్యూటర్ కాలువల ద్వారా చెరువు నీరు కాలనీలోకి చేయడంతో కాలని వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు డిస్ట్రిబ్యూటర్ ద్వారా వచ్చే నీటిని అరికట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.