18-08-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 17 ( విజయక్రాంతి): పక్కా గృహాలకు నోచుకోక పూరి పాకల్లో, చాలీచాలని వసతుల నడుమ జీవనం సాగిస్తున్న గిరిజన గ్రామానికి ఇందిరమ్మ పాలనలో అభివృద్ధికి అడుగులు ప డుతున్నాయి. ఫలితంగా ఆదివాసీల మో ములో ఆనందం తోనికసలాడుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ని యోజకవర్గం పరిధిలోని చండ్రుగొండ మం డలం బెండలపాడు గ్రామంలో ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీ దుగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. జిల్లా యంత్రాంగం ము ఖ్యమంత్రి పర్యటన విజయవంతం పనుల్లో నిమగ్న మయ్యారు.
దశాబ్దాలుగా అభివృద్ధికి దూరం
ఆ గ్రామం యావత్తు ఆదివాసీలే. 95 శా తం పూరి పాకల్లో జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి అభివృద్ధి చెం దక సమస్యలతో సహజీవనం సాగిస్తున్న బెండలపాడు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అశ్వరావుపేట ఎ మ్మెల్యే జారే ఆదినారాయణ కృషి ఆచరణ సాధ్యంలోకి వస్తోంది. పూరిపాక లో నివసిస్తున్న ఆదివాసీలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేప ట్టాలనే పట్టుదలతో ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రా మంగా గుర్తించేందుకు కృషి చేశారు.
బెండలపాడు, బాలికుంట గ్రామాల్లో కలిపి మొ త్తం 450 కుటుంబాలు జీవనం సాగిస్తున్నా యి. వారిలో 310 కుటుంబాలు ఇందిరమ్మ ఎల్లకు అర్హులుగా గుర్తించారు. మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు శ్రద్ధతో చురుగ్గా నిర్మా ణం పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 46 ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. పూర్తయిన ఇండ్లను ఈనెల 21న ముఖ్యమంత్రి ప్రారంభించేందుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. దీంతో ఆదివాసీల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.