17-11-2025 12:00:00 AM
అపరిచితులు అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, నవంబర్ 16 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నిజామాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఫార్మర్లను బద్దలు కొట్టి అందులోని కాపురం దొంగలిస్తున్నారు.
జిల్లాతో పాటు వివిధ మండలాల్లో వివిధ గ్రామాల్లో అపరిచితులు సంచరిస్తున్నట్టయితే వారిని గమ నించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిపి సాయి చైతన్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల వల్ల ట్రాన్స్ఫార్మర్లు లేక పంట పొలా లకు నిరుందించే పంపుసెట్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురి అవుతున్నారు.
చేతికొచ్చిన పంటలు కళ్ళముండే సాగునీరు లేక ఎండిపోతున్నాయి. శనివారం సాయంత్రం ఇందల్వాయి వద్ద అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దోపిడి ముఠాని పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్‌తో పాటురూ :5.50 లక్షల నగదు ను నిందితుల వద్ద నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సర కాలం నుండి నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి ధర్పల్లి డిచ్ పల్లి జక్రాన్ పల్లి మెండోరా ముక్కాల్ మోర్తాడ్ బోధన్ టౌన్ బోధన్ రూరల్ పరిధి లోని పరులు పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లు తోపాటు నవీపేట్ వర్ని తదితర మండలాలతోపాటు ఈ ముఠా కార్యకలాపాలు మహారాష్ట్రలో కూడా ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్ ని దొంగలించే ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.
ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఏడుగురు సభ్యులలో ఐదుగురిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా దొంగలించిన కాపర్ వైర్ల చుట్ట లను కొన్న ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిందితులు జిల్లాలోని వివిధ మండలాల్లోని పోలీస్ స్టేషన్లో పార్ధుల్లో 101 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో ఉన్న కాపర్ కాల్స్ ను దొంగలించి నేరాలకు పాల్పడ్డారు.
ఈ ట్రాన్స్ఫార్మర్ ల కాపర్ వైర్ చోరీ విషయమై 44 కేసులు జిల్లాలో నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసిపి రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ టీం ను నియమించారు. ఈనెల 15వ తేదీన ఇందల్వాయి మండల పరిధిలోని గన్నారం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా మహారాష్ట్రకు చెందిన అహమ్మద్ నగర్ జిల్లా తుంబారె సుధాకర్ ఉత్తరప్రదేశ్ కు చెందిన అమీనా నగర్ సారాయి బాగాపత్ జిల్లా కు చెందిన హర్బీర్ శర్మ, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బారేడిపేటకు చెందిన అలీ మహమ్మద్,
ప్రకాశం జిల్లా బండేల్లిగండ్ల గ్రామానికి చెందిన యాడల వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ జిల్లా మాదాపూర్ మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన శానపల్లి రవీందర్ మేడ్చల్ కు చెందిన అనిల్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వలి కర్ణాటక రాష్ట్రంలోని ఇడ్లూరు పోస్ట్ యాదగిరి నీ సిద్దిపేట జిల్లాకు చెందిన కూరేళ్ల గ్రామం నివాసి గాజుల శ్రీశైలం ముషీరాబాద్ కు చెందిన రామ్ నగర్ కమ్యూనిటీ హాల్ నివాసి మహమ్మద్ హైదర్ అలీ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
పై నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారి నుండి 40 కిలోల కాపర్ వైర్ చుట్టలు రూ:5.50 వేల నగదు రెండు స్కూటీలు 6 సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకొని నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును చేదించడంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని బృందం డిచ్పల్లి సిఐ వినోద్ ఇందల్వా ఎస్త్స్ర సందీప్ డిచ్పల్లి ఎస్త్స్ర షరీఫ్ జక్రాన్ పల్లి ఎస్‌ఐ మహేష్ తో పాటు సిబ్బంది పీ కిరణ్ కుమార్ గౌడ్ ప్రశాంత్ సందీప్ కిషోర్ కుమార్ సుజిత్ నవీన్ సర్దార్ హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ గౌడ్ లను సిపి సాయి చైతన్య అభినందించారు.