27-09-2025 02:00:03 AM
సిఐ కే శశిధర్ రెడ్డి
మందమర్రి, (విజయక్రాంతి): పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమం గా విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 15 వేల విలువగల 750 గ్రాముల గంజాయి, వెయ్యి రూపాయల నగదు, ఆటో, మూడు స్మార్ట్ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నామని పట్టణ సీఐ కే శశిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని సిఐ కార్యాలయంలో ఎస్‌ఐ రాజశేఖర్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు.
రామగుండం టాస్క్ ఫో ర్స్ టీం, పట్టణ పోలీసులు శుక్రవారం పట్టణంలోని టోల్‌ప్లాజా వద్ద గల రెస్ట్ ఏరియా లో నిఘా ఏర్పాటు చేయగా, కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఈజ్ గావ్ గ్రామానికి చెందిన గంజాయి విక్రయ దారుడు తరుణ్ సర్కార్, మంచిర్యాల పట్ట ణం తిలక్ నగర్‌కు చెందిన షేక్ అజీజ్, వనం సాయికృష్ణ కలసి గంజాయి విక్రయి స్తూ ఉండగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాడ్‌కు పంపిన ట్లు ఎస్‌ఐ తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుల్ గోపాల్, సిబ్బంది ఉన్నారు.