14-11-2025 12:53:44 AM
ఏర్పాట్లు పూర్తిచేసిన దేవాదాయ శాఖ అధికారులు
బెల్లంపల్లి, నవంబర్ 13 : బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం పురాతన కోనేరులో మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్, అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు ఆధ్వర్యంలో చేపట్టనున్న గంగా హారతి కార్యక్రమానికి దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పా ట్లు చేపట్టారు.
అర్చకులు సతీష్ శర్మ సమక్షంలో ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశంలోని 14 జీవనదుల జలాలను పవి త్ర కోనేరులో వేద మంత్రోచ్ఛరణల మధ్య కలపనున్నారు. ముందుగా శివలింగంపై జలాభిషేకం చేస్తున్న గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి కోనేరులో జాలు వారుతున్న గంగా ప్రవాహానికి గంగా హారతి చేపట్టనున్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం గంగ మ్మ తల్లికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి ఆడపడుచు వాయునం అందించనున్నారు. భక్తులకు ప్రసాద వితరణ చేపట్టనున్నారు. గంగాహారతిలో పాల్గొనే మహిళలు తప్పనిసరిగా పిండి దీపాలు, తామర డొప్పలు, వత్తులు, తమలపాకులు, పువ్వుల ను తెచ్చుకోవాలని నిర్వాహకులు చెప్పారు.