ధూల్‌పేట్‌లో గంజాయి పట్టివేత
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (విజయక్రాంతి): ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3.69 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌టీఎఫ్ టీం లీడర్ ఎన్ అంజిరెడ్డి తెలి పారు. ధూల్‌పేట్ సమీపంలోని పురాణపూల్ జియాగూడ ప్రాంతంలోని శిషుమందిర్ సమీపం లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దేవరాజ్ సింగ్, అజయ్‌సింగ్, దీపక్, ప్రవీణ్‌సింగ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నితీష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ మధుబాబు, ఎస్సైలు మధుభాస్కర్, భాస్కర్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.




