calender_icon.png 20 November, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన విత్తన చట్టంపై అవగాహన, సలహాల సేకరణ

20-11-2025 12:00:00 AM

సూర్యాపేట, నవంబర్ 19 (విజయక్రాంతి) : కలెక్టరేట్‌లో బుధవారం నూతన విత్తన చట్ట ముసాయిదా బిల్లు 2025పై వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం, కంప సాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ  సమావేశంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్, వ్యవసాయ పరిశోధన స్థానం కంపసాగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ లు నూతన విత్తన చట్ట విధివిధానాలను విశదీకరించారు.

తదుపరి హాజరైన అధికారులు , విత్తన డీలర్లు, విత్తన ఉత్పత్తిదారులు, రైతులు, నాణ్యమైన విత్తనముకు కావలసిన సలహాలు సూచనలు సేకరించారు. ఈ సలహాలు, సూచనలను వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా భారత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందనీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏఓ శ్రీధర్ రెడ్డి, డిహెచ్‌ఎస్‌ఓ నాగయ్య, వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు ఎఫ్ పీ ఓ చైర్మన్లు, విత్తన డీలర్లు, విత్తన ఉత్పత్తిదారులు,  రైతులు తదితరులు పాల్గొన్నారు.