calender_icon.png 18 September, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ

29-06-2024 12:22:37 AM

  • యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్

ఫోర్ట్‌వర్త్ (అమెరికా): యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. బీడబ్ల్యూఎఫ్ సూపర్ టోర్నీ డబుల్స్ విభాగంలో గాయత్రి గోపిచంద్ జాలీ జంట క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో బై లభించడంతో ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ 16 21 21 పెయి షాన్‌ఛే ఎన్‌ఆ (చైనీస్ తైపీ) జంటను మట్టికరిపించింది. ఇక క్వార్టర్స్‌లో ఈ జంట జపాన్‌కు చెందిన హిరోకామి కాటోను ఎదుర్కోనుంది. సింగిల్స్ విభాగంలో ప్రియాన్షు రజావత్‌తో పాటు మాళవిక బన్సోద్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రియాన్షు 21 21 హాంగ్ యూ కెయ్ (చైనీస్‌తైపీ)ని మట్టికరిపించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 15 21 21 చెక్ రిపబ్లిక్‌కు చెందిన తెరెజా వబికోవాను ఓడించింది. క్వార్టర్స్‌లో మాళవిక మూడోసీడ్ క్రిస్టీ గిల్‌మోర్ (స్కాట్లాండ్)ను ఎదుర్కోనుంది.