calender_icon.png 18 September, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగల్‌కు కఠిన డ్రా

29-06-2024 12:19:09 AM

  • వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్

లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్‌కు కఠిన డ్రా ఎదురైంది. తొలిసారి వింబుల్డన్ ఆడనున్న నాగల్ తొలి రౌండ్‌లో సెర్బియాకు చెందిన మియోమిర్ కెక్‌మనోవిక్‌ను ఎదుర్కోనున్నాడు. ప్రస్తుతం 72వ ర్యాంక్‌లో ఉన్న నాగల్ తొలి రౌండ్‌ను దాటడం అంత సులువేం కాదు. ఒకవేళ అన్నీ కలిసొచ్చి మూడో రౌండ్‌కు చేరుకున్నప్పటికీ అక్కడ ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ ఎదురయ్యే అవకాశముంది. ఇటీవలే కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించి సింగిల్స్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.డబుల్స్ విభాగంలో బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన మన్నారినో పెట్షీని ఎదుర్కోనుంది.