08-01-2026 12:00:00 AM
కేసముద్రం, జనవరి 7 (విజయక్రాంతి): అనారోగ్యంతో రిటైర్డ్ ఏఎస్ ఐ బైరు మురళి బుధవారం ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో మరణించారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు లావణ్య, కళ్యాణి ఉండగా, తండ్రి చితికి పెద్ద కూతురు లావణ్య తల కొరివి పెట్టింది. ఈ సంఘటన చూసి గ్రామస్తులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.