28-09-2025 01:02:49 AM
-జిల్లాలు, క్యాటగిరీల వారీగా రిజర్వేషన్ కేటాయింపు
-నోటిఫికేషన్ జారీ చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శ్రీజన
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ల పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్త్తూ శనివారం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభీవృద్ధి శాఖ డైరెక్టర్ శ్రీజన రాష్ర్ట ఎన్నికల అథారిటీ తరఫున జారీ చేశారు.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 176, జీ.వో. నం.41 పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు, 2025 సంవత్సరపు రెండవ సాధారణ జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు చైర్మన్ల పదవుల రిజర్వేషన్లను ఈ గెజిట్ తెలియజేసింది. షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), వెనుకబడిన తరగతులు (బీసీ), మహిళలకు కేటాయించిన చైర్‌పర్సన్ల, అలాగే ఏ రిజర్వేషన్ లేని (అన్‌రిజర్వ్‌డ్) చైర్మన్ల పదవులను కూడా ఈ నోటిఫికేషన్ స్పష్టం చేసింది.