20-12-2025 02:14:15 AM
మూడు రోజులపాటు రెండు షిఫ్టుల్లో నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) పరీక్షలు ఈనెల 22 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలను మూడు రోజులపాటు ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో నిర్వహించను న్నారు. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు అర్హత పొందేందుకు అభ్యర్థులకు ఈ పరీక్షలను ఉ స్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
హాల్‌టికెట్లను అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి కనీసం గంట ముందే కేం ద్రానికి చేరకోవాలని సూచించారు. టీజీ సెట్ పరీక్షలు మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్1ఓ 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో పరీక్ష ఉంటుంది. రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ త రహాలో ఉంటాయి. పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుంది.