01-12-2025 04:32:04 PM
నిర్మల్ (విజయక్రాంతి): శ్రీ సరస్వతి శిశు మందిర్ బుధవార్ పేట్ పాఠశాలలో గీతా జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అయిన శ్రీకాంత్ ఆర్య మాట్లాడుతూ భగవద్గీత పురాతనమైన గ్రంథమని, భగవద్గీతలో ఏ ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుందని, ఇంట్లో భగవద్గీత ఉండాలని భగవద్గీతలో రోజు ఒక శ్లోకాన్ని కచ్చితంగా పారాయణం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు భగవద్గీత శ్లోకాలతో ఆకట్టుకున్నారు. భగవద్గీత మన దేశానికి ఒక గర్వకారణం అని పురాతన గ్రంథం అని తెలియజేశారు. పాఠశాల పూర్వ విద్యార్థి సమితి కోశాధికారి అయిన కిషోర్, సమితి కోశాధికారి, పాఠశాల విద్యార్థులు ఆచార్యులు పాల్గొన్నారు.