05-07-2025 12:20:00 AM
ఇబ్రహీంపట్నం, జూలై 04:ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మి కుడు మృతి చెందిన ఘటన ఇబ్రహీంప ట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. గుండ్ల జంగయ్య (56), రోజు మాదిరిగా గ్రామ సమీపంలోని తాటిచెట్లకు కల్లు గీసేందుకు చెట్టు ఎక్కి, ప్రమాదవశాత్తూ పై నుంచి కింద పడిపోయాడు.
నడుము భా గంలో మోకు జారడంతో కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు స మాచారం అందించి, జంగయ్యను చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందు తూ జంగయ్య మృతి చెందారు.
గీత కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ గీత కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మరణించిన జంగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని వారుడిమాండ్‌చేశారు.