calender_icon.png 5 July, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలా ఆక్రమణలపై హైడ్రా కొరడా

05-07-2025 12:21:25 AM

లింగంపల్లి నాలా ఆక్రమణల తొలగింపు 

శేరిలింగంపల్లి,జూలై 4: చెరువులు, కుంటలు, నాలాలపై నిర్మిస్తున్న ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా ఝుళిపి స్తున్న సంగతి తెలిసిందే.తాజాగా శుక్రవారం నల్లగండ్ల చెరువు నుండి చందానగర్ వరకు ఉన్న లింగంపల్లి నాలా వెంట వెలసిన అక్ర మ నిర్మాణాలను కూల్చవేశారు. నాలా విస్తరణకు 16 మీటర్లుగా నిర్ణయించిన అధికా రులు, అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేశారు.

హైదరాబాద్ నగరంలోని నాలాలపై నాలుగు నెలల పాటు స్పె షల్ డ్రైవ్ చేపట్టినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను ఉపేక్షించేది లేదని, వాటిని తక్షణమే తొలగిస్తామని చెప్పారు. ముఖ్యంగా వరద నీరు నిలిచిపోయే ప్రాం తాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.