calender_icon.png 19 August, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

19-08-2025 12:16:07 AM

యాదగిరిగుట్ట ఆగస్టు 18 విజయక్రాంతి: యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలో నల్ల మాస శంకరయ్య తండ్రి చంద్రయ్య గారు ఉదయం తొమ్మిది గంటలకు వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మరణించారు. శంకరయ్యకు భార్య నలుగురు పిల్లలు , అతని కొడుకు చనిపోయాడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద చనిపోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలతో  మిన్నంటాయి.

శంకరయ్య మృతిపట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ రామచందర్ గారు మాట్లాడుతూ నిరుపేద గౌడ కుటుంబానికి చెందిన శంకరయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని శంకరయ్య మృతి వల్ల కుటుంబం రోడ్డు మీద పడిందని వారి పెద్దదిక్కును కోల్పోయిన వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని కావున ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరడం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా కల్లుగీతకార్మిక సంఘం వారిని ప్రభుత్వం అండగా ఉండాలని, వెంటనే ఎక్స్గ్రేషియా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికులకు కత్తిమీద స్వాముల గడుస్తున్న జీవితం పెనుబారంగా మారాయని, ప్రస్తుతకాలంలో చాలామంది ప్రమాదంలో మరణించడం, కాళ్లు చేతులు పోగొట్టుకోవడం జరిగాయనీ, సేఫ్టీ మోకులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని కల్లుగీత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకోవాలని వారు విజయక్రాంతికి తెలియజేశారు.