19-08-2025 12:45:14 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అందరూ ఈర్షాద్వేషాలను వదిలి సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శ్రావణమాసపు ఉత్సవాలు పురస్కరించుకుని శ్రీ నీలకంఠ స్వామి వారి దేవాలయంలో సోమవారం జరిగిన విశేష పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీలకంఠ స్వామి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయమని, ఇక్కడ నిత్యంతూ నీలకంఠ స్వామి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయమని, ఇక్కడ నిత్యం జరిగే పూజా కార్యక్రమాలు, ప్రత్యేక రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో హైందవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని క్రమం తప్పకుండా వారి మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. నగరంలోని ప్రజలంతా సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని, సూచించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వాదిచారు.