19-08-2025 12:48:53 AM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినిలతో కలిసి తీజ్ తెంపి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిలతో కలిసి సాంప్రదాయ పాటలపై ఎమ్మెల్యే ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తీజ్ పండగ బంజారాలకు ఎంతో ప్రత్యేకమైనది అని పేర్కొన్నారు. అందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని, భారీ వర్షాల కారణంగా జాగ్రత్తలు సైతం పాటించాలని సూచించారు.