19-08-2025 12:18:00 AM
సూర్యాపేట, ఆగస్ట్ 18 (విజయక్రాంతి) : సమాజంలోని ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సర్దార్ సర్వాయి పాపన్న చేసిన మంచి పనులను స్ఫూర్తిగా తీసుకుని పిల్లలకు చెప్పి వారిలో స్ఫూర్తి నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాం బాబు, బీసీ సంక్షేమ అధికారి ఎల్. శ్రీనివాస్, షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి దయానంద రాణి, డి ఆర్ డి ఎ పి డి వి.వి. అప్పారావు, డీఈవో అశోక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, సిపిఓ కిషన్, డీఎఫ్‌ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.