19-08-2025 01:14:36 AM
కరీంనగర్ క్రైం, ఆగస్ట్18(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఒక వ్యక్తికి కరీంనగర్ సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడు రోజుల జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా విధించింది.రాజస్థాన్కు చెందిన నర్సిరామ్ (40), తండ్రి లాలారామ్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డాడు.
అతనిపై కేసు నమోదు చేసి, సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి, నిందితుడు తెలంగాణ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 185 ప్రకారం నేరం చేసినట్లు నిర్ధారించారు. దీంతో నిందితుడికి ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్ష అమలు నిమిత్తం నిందితుడిని కరీంనగర్ జైలుకు తరలించారు.