19-08-2025 12:41:41 AM
అదనపు కట్నం వేధింపులపై గచ్చిబౌలి పిఎస్ లో హీరో ధర్మ మహేష్‌పై కేసు
శేరిలింగంపల్లి: సినిమాల్లో హీరోగా నటిస్తున్న ధర్మ మహేష్.. ఇంట్లో భార్యకే విలన్‌గా మారాడు. అదనపు కట్నం కోసం వేధింపులు భరించలేక భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో బి.ఎన్.ఎస్., డిపి యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. సింధూరం డ్రింకర్ సాయి’ హీరో మహేష్.. గౌతమి డబ్బుతో హోటల్ వ్యాపారం మొదలుపెట్టి దాన్నే తన పేరుమీదకు మార్చుకున్నాడని ఆరోపణ. సినిమాల్లో ఛాన్సులు రావడంతో జల్సాలు, షికార్లలో మునిగిపోయి భార్యపై శారీరక, మానసిక వేధింపులు పెంచాడని గౌతమి వాపోయింది. గతంలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చినా మారని మహేష్‌పై తాజాగా మళ్లీ కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోంది.