calender_icon.png 19 August, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్‌తో ఐదుగురి మృతి

19-08-2025 12:57:43 AM

  1. కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం 
  2. నలుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
  3. హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో ఘటన 
  4. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా
  5. క్షతగాత్రుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది: మంత్రి శ్రీధర్‌బాబు

మేడ్చల్, ఆగస్టు 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రామంత పూర్ గోకులేనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి గోకులేనగర్‌లో స్థానికులు రథంతో ఊరేగింపు నిర్వహించారు.

అర్ధరాత్రి సమయంలో రథాన్నిలాగే వాహనం మొరాయించింది. దీంతో ఆ వాహనాన్ని అక్క డే వదిలేసి స్థానికులు రథాన్ని చేతులతో లాగు తూ ముందుకెళ్లారు. ఒకచోట విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లను తగిలి ఉన్నాయి. అక్కడే విద్యుత్ తీగలు రథానికి తగిలాయి. దీంతో రథానికి విద్యుత్ సరఫరా అయింది. రథాన్ని పట్టుకు న్న 9 మంది షాక్‌కు గురయ్యారు. వారంతా ఒక్కసారిగా విసిరేసినట్టు దూరంగా పడిపోయారు.

ఈ ఘటనతో స్థానికులు భయభ్రాం తులకు గురయ్యారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కృష్ణ యాదవ్ (21), సురేష్ యాదవ్ (34), శ్రీకాంత్‌రెడ్డి (35), రుద్ర వికాస్ (39), రాజేందర్‌రెడ్డి (45) మృతిచెందారని వైద్యులు నిర్ధా రించారు.

మరో నలుగురిలో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న గణేష్ పరిస్థి తి విషమంగా ఉంది. శ్రీనివాస్ మాట్రిక్ ఆసుపత్రిలో, రవికుమార్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఒకరు డిశ్చార్జి అ య్యారు. కాగా ఊరేగింపు మరో 100 మీటర్ల దూరంలో ముగుస్తుందనగా ఈ దురదృష్టకర సంఘటన జరగడం అత్యంత బాధాకరం. 

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం!

ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. విద్యుత్ స్తంభాలు, తీగల పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తే ఈ ప్రమా దం జరిగేది కాదంటున్నారు. విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లను తగిలి ఉన్నప్పటికీ గమనించకపోవడం ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం అంటు న్నారు. సంఘటనా స్థలానికి సీఎండి ముషారఫ్ ఫరూకి వచ్చిన సమయంలో స్థానికులు ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 

కేబుల్ వైరుకు విద్యుత్ సరఫరా: ట్రాన్స్‌కో సీఎండి ముషారఫ్ ఫరుకి 

ఘటన స్థలాన్ని దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూకి పరిశీలించారు. రెండు బిల్డింగులను అనుసంధానం చేస్తూ నిరూపయోగంగా పడి ఉన్న స్టార్ కేబుల్ వైర్ తెగి 11 కెవి ఓవర్ హెడ్‌లైన్ మీదుగా జారీ ఐరన్ ఫ్రేమ్‌తో రూపొం దించిన వ్రతానికి తగిలిందని, ఆ కేబుల్‌లో ఉన్న కాపర్ వైర్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగి ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు సీఎండీకి వివరించారు. ఈ ఘటనలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం లేదని తెలిపారు.

ఘటన జరిగిన ప్రదేశంలో 11 కేవీ లైన్ 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉందని, దీనికి తోడు గతంలోనే ఎల్ టి ఓవర్ హెడ్ లైన్స్ స్థానంలో ఏబి కేబుల్‌ను అమర్చమని చెప్పారు. బిల్డింగులను అనుసంధానం చేస్తూ ఏర్పాటుచేసిన కేబుల్ వైరే ప్రధాన కారణమని సీఎండీ వివరించారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యా ప్తు చేసి నివేదిక అందజేయాలని అభిషేక్ కూడా ఎస్‌ఈ ప్రతిమ షోన్‌ను సీఎం ఆదేశించారు.

అత్యంత విషాదకరం: కేటీఆర్

హైదరాబాద్(విజయక్రాంతి): కృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఐదుగురు యువకులు మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు సాను భూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబా లకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, గాయపడిన వారి వైద్య ఖర్చుల ను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

కేబుల్ వైరు ద్వారా కరెంటు సరఫరా జరి గి ప్రమాదం జరిగినట్లు అధికారులు చెపుతున్నారని, కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు. దర్యా ప్తు నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్‌కు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.