calender_icon.png 19 August, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందానగర్ సర్కిల్‌లో ప్రజావాణి

19-08-2025 12:36:29 AM

శేరిలింగంపల్లి: ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం చందానగర్ సర్కిల్‌–21లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుండి 7 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో 4, రెవెన్యూ విభాగంలో 1, హెల్త్‌ & శానిటేషన్‌ విభాగంలో 1, ఇంజనీరింగ్‌ విభాగంలో 1 ఫిర్యాదు నమోదైంది. సమస్యలు వినగానే తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ నాగిరెడ్డి, జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.