calender_icon.png 19 August, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలి

19-08-2025 12:59:02 AM

తహశీల్దార్, ఎంపీడీవో

మోతె,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరద సమస్యను పరిష్కరించడానికి మోతె తహశీల్దార్ ఎం. వెంకన్న, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆంజనేయులు, ఇతర అధికారులతో కలిసి వేగంగా చర్య తీసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోకి వెళ్లేందుకు అంతరాయం కలిగించిన వర్షపు నీటిని జెసిబి సహాయంతో తొలగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.భారీ వర్షాల సమయంలో నీరు నిలిచిపోకుండా తొలగించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్,ఎంపీడీవో లు కోరారు.