calender_icon.png 19 August, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీకి పుతిన్ ఫోన్

19-08-2025 12:40:15 AM

  1. అలస్కా సమావేశం వివరాలు పంచుకున్న రష్యా అధ్యక్షుడు
  2. పుతిన్‌కు ధన్యవాదాలు తెలిపిన భారత ప్రధాని

న్యూఢిల్లీ, ఆగస్టు 18: రష్యా అధ్యక్షు డు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం ఫోన్ చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడితో జరిగిన అలస్కా సమావేశానికి సంబంధించిన వివరాలను మోదీతో పంచు కున్నారు. స్వయంగా ప్రధాని మోదీనే ఈ విషయాన్ని ఎక్స్‌లో ప్రకటించారు.

‘అలస్కా సమావేశానికి సంబంధించిన వివరాలను పంచుకున్నందుకు నా స్నేహితుడు పుతిన్‌కు ధన్యవాదాలు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగానే పరిష్కరించుకో వాలని భారత్ పిలుపునిస్తోంది. ఈ విషయంలో అన్ని ప్రయత్నాలకు మద్దతునిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు.