calender_icon.png 29 October, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర పౌరులకు జీహెచ్‌ఎంసీ శుభవార్త

29-10-2025 01:41:33 AM

-‘మీసేవ’కు వెళ్లకుండానే ఇంటి నుంచే సేవలు  

-ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి):నగర పౌరులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలను అందించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ మరో కీలక ముం దడుగు వేసింది. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించి ఇప్పటివరకు మీ-సేవ కేంద్రా ల్లో మాత్రమే అందుబాటులో ఉన్న పలు ముఖ్యమైన సేవలను ఇకపై పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో తీసుకువచ్చింది.

పౌరులు తమ ఇంటి నుంచే జీహెచ్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలను సులభంగా పొంద వచ్చని, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మంగళవారం ఒక ప్రకటనలో జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.  దరఖా స్తుదారులు తమ పీటీఐఎన్, టీఐఎన్, లేదా వీఎల్టీఎన్ నంబర్లను ఉపయోగించి నేరుగా తమ సేల్ డీడ్ మరియు ఇతర అవసరమైన పత్రాలను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ https:// www. ghmc.gov.in లోని ’ఆన్లైన్ సర్వీసెస్’ విభాగంలో అప్‌లోడ్ చేయవ చ్చు. సమర్పించిన దరఖాస్తులు తక్షణమే సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆన్లైన్లో బదిలీ అవుతాయని, వారు వాటిని పరిశీలించి వేగంగా ఆమోదం తెలుపుతారు.

అందుబాటులోకి ఆన్‌లైన్ సేవలు

ఆస్తిపన్ను మ్యుటేషన్.. ఆస్తుల యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఖాళీ స్థలం పన్ను మ్యుటేషన్.. ఖాళీ స్థలాల యా జమాన్య బదిలీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పీటీఐఎన్ నంబర్ బ్లాకింగ్.. డూ ప్లికేట్ పీటీఐఎన్ నంబర్లు ఉన్నా, భవనాలను కూల్చివేసినా, పాత స్థానంలో కొత్త నిర్మాణం చేపడుతున్నా పాత పీటీఐఎన్ నంబర్‌ను ఆన్‌లైన్ లోనే బ్లాక్ చేసుకోవచ్చు. వీఎల్టీఎన్ నంబర్ బ్లాకింగ్.. డూప్లికేట్ వీఎల్టీఎన్ నంబర్లను లేదా ఖాళీ స్థలంలో కొత్త భవనం నిర్మించినప్పుడు పాత నంబర్‌ను బ్లాక్ చేసే సదుపాయం కల్పించారు.