29-10-2025 12:47:19 AM
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు
50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తం గా విధులు నిర్వర్తిస్తున్న 1.15 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 8వ వేతన కమిషన్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వేతన కమిషన్‌కు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనదేశాయ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించ నున్నారు. 2026తో ప్రస్తుత 7వ వేత న సవరణ సంఘం కాలపరిమితి ముగియనున్నది.
ఈ క్రమంలోనే కొత్త వేతన సవరణ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు మంత్రిత్వ విభాగాధిపతులతో విస్తృత స్థాయి సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించింది. దీనిలో భాగంగా మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో క్యాబినెట్ అనేక కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.
8వ వేతన కమిషన్‌కు ఆమోదంతో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పింఛనుదారులకు సం బంధించిన వేతనాలు, పింఛన్లు పెంపునకు మార్గం సుగమమవుతుంది. కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ రంజన దేశాయ్, ఇద్దరు సభ్యు లు తమ సిఫార్సులను 18 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు.
కమిషన్ సిఫార్సులతో రక్షణ సేవా సిబ్బంది సహా దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులు, 69 లక్షల మం ది పెన్షనర్ల వేతనాలు, భత్యాలు పెరగనున్నాయి. ఆర్థిక పరిస్థితు లను దృష్టిలో పెట్టుకు ని కమిషన్ ప్రస్తుత వేతనాలు, పింఛన్‌ను ఎంతమేరకు పెంచాలో నిర్ణయిం చి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.
ఎరువులపై రూ.3 వేల కోట్ల రాయితీ
భారత రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఫెర్టిలైజర్స్‌పై రూ.3 వేల కోట్ల మేర రాయితీ ఇవ్వాలనే నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, సల్ఫర్, అమ్మోనియం ఫాస్ఫేట్‌తో పాటు మొత్తం 28 రకాల ఎరువులు తక్కువ ధరకే లభించనున్నాయి.
ఈ నిర్ణయం ఆహార భద్రత, వ్యవసాయరంగ వృద్ధికీ ఊతమివ్వనున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా 14.6 కోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. వాణిజ్యపరంగా అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గుల ప్రభావం నుంచి రైతులను రక్షించి, తక్కువ ధరకే ఎరువులను అందించాలనే లక్ష్యంతోనే భారీ మొత్తంలో రాయితీ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.